Advertisement
Google Ads BL

RRR హీరోల అద్భుతం


కరోనా కారణంగా ఒక్క ఆర్.ఆర్.ఆర్ ఏంటి చాలా సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడగా.. కొన్ని సినిమాలు థియేటర్స్ బంద్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనే కాదు.. ప్రపంచం మొత్తం కరోనా కల్లోలం మాములుగా లేదు. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునే కరోనా కట్టడి చెయ్యొచ్చు, లాక్ డౌన్ పెడితే కరోనా తగ్గుతుంది. అయితే గతంలో కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కరోనా రాకుండా మాస్క్, శానిటైజేర్ లు వాడాలంటూ వినూత్నంగా ఓ వీడియో చేసినట్లుగా ఇప్పుడు టీంలోని దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ అలియా భట్, అజయ్ దేవగన్ లు కరోనా కట్టడి కోసం వినూత్న ప్రయత్నం చేసారు.

Advertisement
CJ Advs

వీరంతా కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల్ని ఓ వీడియో ద్వారా షేర్ చేసారు. అందులో వారంతా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో #StandTogether పేరుతో చెర్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ కరోనా జాగ్రత్తలని పాన్ ఇండియా లెవల్లో చెప్పడం చూస్తే నిజంగా సూపర్బ్ అనిపిస్తుంది. ఇక ఆ వీడియో లో హిందీలో టాప్ హీరోయిన్ అయిన అలియా భట్‌ తెలుగులో, రామ్‌చరణ్‌ తమిళంలో, ఎన్టీఆర్‌ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పడం భలేగా ఉంది.

అలియా భట్ తో మొదలైన వీడియోలో అలియా భట్ అందరికి నమస్కారం.. దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా ఆక్రోసన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2020 లో కరోనాకు వ్యతిరేకంగా ఎంతో పోరాడాం. మళ్లీ ఇప్పుడు అలాగే పోరాడదాం. అందరూ మాస్కు ధరించడం, చేతులను శానిటైజర్‌ చేసుకోవడం, అందరిలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడమే వంటివి కరోనాపై పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధాలు. కరోనా వ్యాక్సిన్‌పై వస్తున్న అపోహలను నమ్మకండి. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను టీకా వేయించుకొనేలా ప్రోత్సహించండి. 

ఇలాంటి సమయంలో సేఫ్ గా ఇంట్లోనే ఉండటం ఎంతో ముఖ్యం. అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి. అందరూ మాస్కు పెట్టుకోవడంతో పాటు టీకా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేద్దాం. మాస్క్‌ ధరిద్దాం.. వ్యాక్సిన్‌ వేయించుకుందాం అంటూ అలియా భట్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అజయ్ దేవగన్ లు ఈ వీడియోలో కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు.

RRR Movie Team Corona Awareness and Vaccination Appeal:

RRR Movie Team Corona Awareness and Vaccination Appeal Video viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs