Advertisement
Google Ads BL

అనసూయ కి అంత తక్కువ


అనసూయ బుల్లితెర మీద క్రేజ్ ఉన్న హాట్ యాంకర్. అనసూయ జబర్దస్త్ అందాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హైలెట్ అవుతుంటాయి. కరోనా లాక్ డౌన్ తో కాస్త ఒళ్ళు చేసిందో.. లేదంటే ఆమె రీసెంట్ మూవీ థాంక్యూ బ్రదర్ కేరెక్టర్ లో ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించడం కోసం బరువు పెరిగిందో తెలియదు కానీ.. ఒళ్ళు చేసినా.. అనసూయ గ్లామర్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇప్పటికే గ్లామర్ డ్రెస్సులతో అదరగొడుతున్న అనసూయ థాంక్యూ బ్రదర్ లో ప్రెగ్నెంట్ లేడి పాత్ర చెయ్యడం సాహసమనే చెప్పాలి. కాస్త ట్రెడిషనల్ గా కనిపిస్తూ.. తొమ్మిదినెలల కడుపుతో అనసూయ అలాంటి పాత్ర చెయ్యడం నిజంగా సూపర్బ్. ఇప్పటికి బుల్లితెర మీద గ్లామర్ యాంకర్స్, హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే అనసూయ తో ఈ వయసులో పోటీ పడేవారే లేరు. 

Advertisement
CJ Advs

అటు వెండితెర మీద అనసూయ డైరీ ఫుల్. రవితేజ ఖిలాడీ, లేటెస్ట్ గా పాన్ ఇండియా ఫిలిం పుష్ప లో కూడా నటిస్తున్న అనసూయ థాంక్యూ బ్రదర్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ హైలెట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ లో అనసూయ కేవలం 17 రోజులే పని చేసిందట. అంటే 17 రోజుల డేట్స్ ఈ సినిమా కోసం కేటాయించిన అనసూయ.. ఈ సినిమాకి అందుకున్న పారితోషకం చాలా అంటే చాలా తక్కువ. కేవలం 25 లక్షల పారితోషకానికి అనసూయ ఈ సినిమాకి పని చేసింది. మంచి గ్లామర్, మంచి క్రేజ్ ఉన్న అనసూయ ఈ సినిమా కోసం ఇంత తక్కువ పారితోషకం తీసుకుంది అంటే ఆమె అభిమానులకి షాక్. 

ఇక థాంక్యూ బ్రదర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే బావుండేది. కానీ కరోనా తో చిన్న ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా కి ఈ సినిమాని అమ్మేసారు మేకర్స్. అనసూయ అభిమానులకి ఈ విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉంది. అదే థియేటర్స్ లో రిలీజ్ అయితే అనసూయ కి ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ కేరెక్టర్ చేసినందుకు అవార్డులు కూడా వచ్చేవని ఆమె ఫాన్స్ ఫీలింగ్.

Anasuya Charged This Much?:

Anasuya Fee For Thank You Brother!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs