Advertisement
Google Ads BL

దేవరకొండ బర్త్ డే స్పెషల్ అదేనా


విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ కి పాకేసింది. అందుకే విజయ్ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పూరి జగన్నాధ్ తో కలిసి లైగర్ సినిమాని పాన్ ఇండియా కి చేర్చాడు. అందులో బాలీవుడ్ నటులతో లైగర్ పై అంతకంతకు క్రేజ్ పెంచేస్తున్నారు. అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీపై బోలెడంత క్రేజ్ వుంది. ప్రస్తుతం ముంబై లో లాక్ డౌన్ నడుస్తుండంతో లైగర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ ఉన్న విజయ్ దేవరకొండ ఇక్కడ ఓ యాడ్ షూట్ కూడా పూర్తి చేసేసాడు. ఇక మరోపక్క పూరి జగన్నాధ్ లైగర్ ఎడిటింగ్ లో బిజీగా ఉన్నట్లుగా ఎప్పుడో తెలియజేసాడు.

Advertisement
CJ Advs

అయితే పూరీ జగన్నాధ్ అంత తొందరగా ఎడిటింగ్ కి వెళ్ళింది లైగర్ టీజర్ ని రెడీ చేసేందుకే అంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ బర్త్ డే కి ఆయన ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట పూరి. రౌడీ హీరో విజయ్ కి ఎంతక్రేజ్ ఉందొ.. ఎంతమంది ఫాన్స్ ఉన్నారో తెలుసు. ఆయన లైగర్ లుక్ వదిలినప్పుడే టాటూలు వేయించుకుని పాలాభిషేకాలు చేసారు ఫాన్స్. అయితే ఇప్పడు విజయ్ దేవరకొండ బర్త్ డే కి పూరి లైగర్ టీజర్ వదలబోతున్నాడనే న్యూస్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. 

మే 9 న అంటే మరో రెండు రోజుల్లో లైగర్ టీజర్ యూట్యూబ్ ని ఊపెయ్యబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ కే ఫాన్స్ రచ్చ చేస్తే.. ఇక టీజర్ కి ఇంకెంత రచ్చ చేస్తారో.. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. లైగర్ టీజర్ మే 9 న ఉండబోతుంది అని మాత్రం తెలుస్తుంది.

Liger special surprise on Vijay Devarakonda birthday:

Liger teaser on Vijay Devarakonda Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs