గత ఏడాది ఇదే టైం కి కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో ఆర్.ఆర్.ఆర్ నుండి రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా అల్లూరి సీతారామరాజు టీజర్ ని వదిలి మెగా ఫాన్స్ ని సంతోషపెట్టారు రాజమౌళి. కానీ ఎన్టీఆర్ బర్త్ డే కి కొమరం భీం టీజర్ ని రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ ని రిలీజ్ చేసినా.. రికార్డులు కొట్టి చూపించాడు తారక్. తారక్ ఫాన్స్ యూట్యూబ్ రికార్డ్ వ్యూస్, లైక్స్ తో ఎన్టీఆర్ పొటన్షియాలిటీ ఏమిటో చూపించారు. అయితే ఈ ఏడాది మాత్రం తారక్ ఫాన్స్ ని డిస్పాయింట్ చెయ్యడం లేదు రాజమౌళి.
ముందు నుండే తారక్ బర్త్ డే కి గట్టిగా చెయ్యాలి అనే ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నారు. విశేషం ఏమిటి అంటే మొన్న రామ్ చరణ్ బర్త్ డే కి అల్లూరి సీతారామరాజు లుక్ తో పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు తారక్ బర్త్ డే కి కొమరం భీం పోస్టర్ తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ టీజర్ కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇది నిజంగా తారక్ ఫాన్స్ కి కిక్కిచ్చే విషయం.
ఇక్కడ మెగా ఫాన్స్ కి కూడా మరో సర్ ప్రైజ్ ఉందండోయ్. ఇదే టీజర్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. చరణ్ - ఎన్టీఆర్ కలయికని బిగ్ స్క్రీన్ మీద చూడాలని తహతహలాడుతున్న ఫాన్స్ కి ఆ టేస్ట్ రుచి చూపించబోతున్నారు ఈ టీజర్ ద్వారా రాజమౌళి.