Advertisement
Google Ads BL

ప్రభాస్ రాధేశ్యామ్ కి బిగ్ ప్రాబ్లెమ్


ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా లుక్స్ విషయంలో, షూటింగ్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ లుక్ లో మెప్పించలేకపోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఏళ్ళకి తరబడి జరుగుతూనే ఉంది. జులై 30న రాధేశ్యామ్ రిలీజ్ అంటున్నా ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇక దసరాకి కూడా రాధేశ్యామ్ రిలీజ్ కష్టమనే టాక్ అయితే సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఎందుకంటే రాధేశ్యామ్ మూవీ 80 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అందుకే ఆ కాలానికి సరిపోయేలా కొన్ని సెట్స్ వేశారు. దానికోసమే సీజీ వర్క్ పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. రాధేశ్యామ్ వీఎఫెక్స్ కే దాదాపు 60 కోట్లు కేటాయించారు నిర్మాతలు. ఇప్పటికే సీజీ ప‌నులు చాలా కంపెనీల చేతుల్లో ఉంచారు. కానీ అవన్నీ ఇప్పుడు వర్క్ చెయ్యడం లేదని, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో రాధేశ్యామ్ వీఎఫెక్స్ పూర్తి కావడం కష్టంగానే ఉందట. అదే విషయాన్ని రాధేశ్యామ్ టీం కి వీఎఫెక్స్ వర్క్ చేసే కంపెనీలు చెప్పేశాయనే న్యూస్ చూసాక ప్రభాస్ ఫాన్స్ తల పట్టుకుంటున్నారు. నీ దేశం లేదు, నా దేశం లేదు. ప్రపంచం మొత్తం కరోనా కల్లోలంలో ఉండడంతో ఎంప్లాయిస్ ఎవరూ వర్క్ చెయ్యడానికి రావడం లేదంటూ వీఎఫెక్స్ కంపెనీలు చేతులెత్తెయ్యడంతో ఇప్పుడూ రాధేశ్యామ్ టీం కి దిక్కు తోచడం లేదట.

Trouble Continues For Radhe Shyam:

VFX works delaying Radhe Shyam release?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs