Advertisement
Google Ads BL

థాంక్యూ బ్రదర్ ఆ సినిమాకి ఇన్స్పైర్ ఆర్ కాపీ?


అనసూయ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన థాంక్యూ బ్రదర్ సినిమా కరోనా సెకండ్ వేవ్ తో థియేటర్స్ మూత బడడంతో రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. ఇక థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చెయ్యలేక ఓటిటికి అమ్మేవారు. థాంక్యూ బ్రదర్ మేకర్స్ ఈ సినిమాని ఆహా లో రేపు శుక్రవారం రిలీజ్  చెయ్యబోతున్నారు. అయితే థాంక్యూ బ్రదర్ పై కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే థాంక్యూ బ్రదర్ మూవీ ట్రైలర్ అండ్ పోస్టర్స్ ని బట్టి చూస్తే.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఎలివేటర్ బేబీ అనే నైజీరియన్ మూవీకి కాపీ అంటున్నారు. 

Advertisement
CJ Advs

మరి ఎలివేటర్ బేబీ మూవీ ని చూసి థాంక్యూ బ్రదర్ దర్శకుడు ఇన్స్పైర్ అయ్యాడా.. లేదా కాపీ కొట్టాడా.. అనేది థాంక్యూ బ్రదర్ సినిమా చూస్తే కానీ తెలియదు. 2019 లో వచ్చిన ఆ నైజీరియన్ మూవీ కాన్సెప్ట్ అలాగే థాంక్యూ బ్రదర్ మూవీ కాన్సెప్ట్ మాత్రం ఒకే విధంగా ఉండడంతో ఆ సినిమాకి ఈ సినిమా కాపీ అని చాలామందే ఫిక్స్ అవుతున్నారు. మరి ఈ న్యూస్ విన్నాక అందరూ ఆ ఎలివేటర్ బేబీ ని నెట్ ఫ్లిక్స్ లో చూసేసి ఉంటారు. ఇప్పుడు ఆహలో విడుదల కాబోయే థాంక్యూ బ్రదర్ ని ఏ మేరకు వీక్షిస్తారో. అసలే ఆహా ప్లాట్ ఫామ్ వాళ్ళు ఈ సినిమాని కోటిన్నరకి కొనుక్కుందని సమాచారం. మరి ఆహా లో రిలీస్ అవుతున్న సినిమాలు హిట్స్ లేక అంతంత మాత్రంగా వున్న ఆహా మరో పరాజయం చూస్తుందా.? అనసూయ ప్రెగ్నెంట్ గా కనిపిస్తున్న ఈ మూవీ ఏమిటి.? ఎలా ఉండబోతుంది.? అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. 

Anasuya Thank You Brother copied from a Nigerian film:

Anasuya Thank You Brother copied from a Nigerian film elevator baby
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs