Advertisement
Google Ads BL

మహేష్ - త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ టైటిల్


11 ఏళ్ళ తర్వాత అనూహ్యంగా మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అవడమే కాదు.. ఈ సినిమా ఈనెల 31 న మొదలై  త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోబోతున్నట్టుగా చెబుతున్నారు. మహేష్ SSMB28 గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అతడు, ఖలేజా మూవీ లతో సూపర్ హిట్ కొట్టిన జోడి కావడంతో త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ అవడం పక్కా అని మహేష్ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అలా వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో మహేష్ త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపడం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా నుండి తప్పుకోవడంతో.. ఈ కాంబో సెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

త్రివిక్రమ్ మహేష్ తో చెయ్యబోయే మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని, సర్కారు వారి పాటలో యాక్షన్ చూపించే మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీలో ఫ్యామిలీ హీరోగా, కామెడీ గా కనిపించబోతున్నాడట. అయితే త్రివిక్రమ్ - మహేష్ మూవీ టైటిల్ గా ఓ టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటిగా తెరకెక్కిన అతడు సినిమాలో మహేష్ కేరెక్టర్ పేరు పార్థూనే SSMB28 వర్కింగ్ టైటిల్ గా పెట్టబోతున్నారట. ఒకవేళ ఈ మూవీ కి అదే టైటిల్ తో క్రేజ్ సంపాదిస్తే ఫైనల్ గా SSMB28 కి పార్థూ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.

Interesting title in consideration for SSMB28:

Working title for Mahesh and Trivikram Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs