అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడు. తన ఆరోగ్యం బాగానే ఉంది అని, కరోనా తో మైల్డ్ సింటెమ్స్ ఉన్నాయని, ప్రస్తుతం బాగానే ఉన్నా అంటూ ఆయన తన హెల్త్ అప్ డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆయన అభిమానులు శాంతించారు లేదంటే #GetWellSoonAlluArjun అంటూ ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ తన లేటెస్ట్ చిత్రం పుష్ప పాన్ ఇండియాకి ఫ్యాన్ మెడ్ పోస్టర్ చూసి పరవశించిపోయాడు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో రష్మిక హీరోయిన్ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.
కరోనా సెకండ్ వేవ్ కారణముగా పుష్ప షూటింగ్ వాయిదా పడినా అల్లు అర్జున్ పుష్ప టీజర్ సోషల్ మీడియాలో ఇంకా రికార్డులు సృష్టిస్తుంది. అయితే అల్లు అర్జున్ మాస్ లుక్ , రష్మిక భుజాన కాడి వేసుకున్న లుక్ , ఇంకా అల్లు అర్జున్ లుంగీకట్టి గొడ్డలి పట్టిన లుక్, అలాగే అల్లు అర్జున్ లాంతరు పట్టుకుని రౌడీలని వేటాడే లుక్ తో అల్లు అర్జున్ ఫాన్స్ పుష్ప ఫ్యాన్ మెడ్ పోస్టర్ రెడీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ పోస్టర్ చూసిన అల్లు అర్జున్ I love love love graphics ! Loved this fan made poster . Thank you టూ ట్వీట్ చెయ్యడం చూసిన ఆయన ఫాన్స్ పులకరించిపోతున్నారు. ప్రస్తుతం పుష్ప ఫ్యాన్ మెడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.