Advertisement
Google Ads BL

రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా


రవితేజ క్రాక్ హిట్ జోరుతో.. రమేష్ వర్మ తో చకచకా ఖిలాడీ మూవీ ని ఫినిష్ చేసేసి మే 28 న రిలీజ్ కి సిద్ధం చేసేద్దామనుకున్నాడు. రమేష్ వర్మ తో గ్యాప్ లేకుండా షూటింగ్ చేయించిన రవితేజకి కరోనా సెకండ్ వేవ్ ముందుగా షాకిచ్చింది. అందరికన్నా ముందు ఖిలాడీ మూవీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇటలీలో కరోనా నిభంధనలతో లాక్ డౌన్ పెట్టెయ్యడంతో అందరికన్నా ముందే ఖిలాడీ టీం హైదరాబాద్ కి వచ్చేసింది. అయితే ఈనాటి వరకు ఖిలాడీ సినిమా అదే మే 28 డేట్ కి వస్తుంది అనుకున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా సినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

రవితేజ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తుంది. రవితేజ తో ఢీ అంటే ఢీ అనే పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటిస్తుంది అనే టాక్ ఉంది. ఇక మే 28 న సినిమా ని రిలీజ్ చెయ్యడం సాధ్యమయ్యే పని కాదని ఖిలాడీ టీం.. సినిమాని పోస్ట్ పోన్ చెయ్యడం ఉత్తమం అని భావించి.. సినిమా ని పోస్ట్ పోన్ చేస్తున్నారట. ఖిలాడీ సినిమా వాయిదా వేస్తున్నామనే విషయం అధికారికంగా ప్రకటించబోతుంది టీం. అలాగే పరిస్థితులు అనుకూలించాక ఖిలాడీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

Khiladi Movie release postponed :

Ravi Teja Khiladi Movie release postponed due to corona second wave 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs