కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ దేశ ప్రధాని లాక్ డౌన్ పెడతారని ఎదురు చూస్తున్న ప్రజలకి.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్స్, కర్ఫ్యూలు విధించుకుంటున్నాయి. రాష్ట్రాలు ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవాలని, లాక్ డౌన్ పెట్టలేమని దేశ ప్రధాని చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ వలన కేసులు తగ్గు ముఖం పట్టాయి. ఇక ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుండి తమ రాష్ట్రంలో మధ్యాన్నం 12 నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ పెట్టింది. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు లేవని దుకాణాలు యధావిధిగా తెరుచుకోవచ్చని, మధ్యాన్నం 12 తర్వాత దుకాణాలకు అనుమతులు లేవని, అంబులెన్సు, గూడ్స్ ఇలా అత్యవసర సేవలకు మత్రమే అనుమతులు ఇస్తూ ఈ నెల 18 వరకు ఈ పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉంటున్నట్లుగా ప్రకటించారు.
ఇక తమిళనాట ఇప్పటివరకు నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా.. రేపటి నుండి తమిళనాడులోనూ లాక్ డౌన్ పెట్టబోతున్నారు. ఈ నెల 20 వరకు తమిళనాట లాక్ డౌన్ అమలవుతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్న స్టాలిన్ నేడు గవర్నర్ ని కలిసి తమ బలాన్ని వివరించి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతులు కోరబోతున్నారు. తమిళనాట లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఇంటి నుండి బయటికి రావొద్దు అని అత్యవసరం అనిపిస్తేనే ఇంటి నుండి బయటికి రావాలని సూచించింది.