Advertisement
Google Ads BL

ట్విట్టర్ పై విరుచుకుపడిన కంగనా


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ తానొక హీరోలా ఫీలవుతుంది. ఏ విషయంలోనైనా తనని ఓడించి గెలవలేరనే ధీమా కనిపిస్తుంది. బిజెపి అండతో చెలరేగిపోయే కంగనా మహారాష్ట్రలో శివ సేన ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటుంది. అలా తనకి తోచినది, తనకి నచ్చింది సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా బెంగాల్ లో మమతా బెనర్జీ గెలుపుపై కంగనా వేసిన సెటైర్స్ కి కంగనా పై ట్విట్టర్ వేటు వేసింది. మమతా బెనర్జీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. ప్రధాని మోదీ తన పాత విశ్వరూపాన్ని చూపించాలని, మమతను పావులా చేసి ఓ ఆట ఆడించాలని తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడంతో.. ట్విట్టర్‌కు సంబంధించిన నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్విట్టర్ లో కంగనా అకౌంట్ ని సస్పెండ్ చేసింది ట్విట్టర్. 

Advertisement
CJ Advs

అయితే తన అకౌంట్ ని ట్విట్టర్ సస్పెండ్ చెయ్యడం పై కంగనా విరుచుకుపడింది. ట్విట్టర్ అమెరికన్లదని, అమెరికా లో పుట్టిన తెల్లజాతీయులకి గోధుమరంగులో ఉండే వాళ్లపై ద్వేషం ఉంటుంది అని, తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసినంత మాత్రాన తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పింది. తన గొంతును వినిపించేందుకు తనకు ఇంకా చాలా మార్గాలున్నాయని, అంతేకాకుండా తను నిర్మించే సినిమాల ద్వారా కూడా తనేం అనుకుంటున్నానో అది చెప్పగలను అంటూ ట్విట్టర్ పై విరుచుకులపడింది కంగనా. 

Kangana Twitter account permanently suspended:

Kangana says I have many platforms
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs