తమిళనాట అస్సాంబ్లీ ఎన్నికలు ముగియడం, ఫలితాలు రావడం డీఎంకే నేత స్టాలిన్ రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడం ఇదంతా తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా ప్రచారం చెయ్యడమే కాదు.. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ కూడా తన పార్టీతో పోరాటం చేసినా కమల్ ని తమిళ తంబీలు లైట్ తీసుకున్నారు. అయితే ఇదే ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పోటీ చేసి ఉంటే.. ఒక్కసారి ఊహించుకోండి. ఎంజీఆర్, జయలలిత మాదిరి సూపర్ స్టార్ రజిని ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యేవారా?
రజినీకి ఫాన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ రజినీకాంత్ కి ఓట్లేసి ఆయన్ని సీఎం ని చేసేవారా? అసలు రజినీకాంత్ కి డిసెంబర్ లో హెల్త్ ప్రోబ్లెంస్ రాకపోతే.. ఆయన పార్టీ పెట్టేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారే. మరి డీఎంకే లో కరుణానిధి మరణంతో స్టాలిన్ కి సింపతీ వచ్చింది. మరోపక్క అన్నాడీఎంకే లో జయలలిత పై తమిళుల్లో సింపతీ వుంది. అలాంటప్పుడు ఎంజీఆర్ లా పార్టీ పెట్టేసి గెలిచేసే సత్తా రజినీకాంత్ కి ఉందా? మూడు నెలల ముందు పార్టీ పెట్టి అస్సాంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేస్తే.. రజినీకాంత్ కి ప్రజలు పట్టం కట్టేస్తారా? ఎప్పటినుండో పార్టీ పెట్టి తమిళనాడులో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో మమేకమైనా కమల్ కే పరాజయం తప్పలేదు.
మరి సూపర్ ఫేమ్, క్రేజ్ వుంది కదా ఎన్నికల్లో నిలబడి గెలిచేద్దామంటే.. అది కూడా ఫాన్స్ ని నమ్ముకుని అనేది చూస్తే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మాదిరి రజిని పరిస్థితి యేదో? లేదంటే చిరు లాగా ఓ 10 నుండి 15 సీట్లైనా గెలిచి పరువు నిలబెట్టుకునేవారో.. ఏదైనా ఈ ఎన్నికల్లో స్టాలిన్ అంటే డీఎంకే పార్టీ విజయం తథ్యం అనేది తెలియకపోయినా.. రజినీకాంత్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుని మంచి పని చేసారంటూ రాజకీయనిపుణులు చెబుతున్న మాట. అయన ఆరోగ్యమే ఆయన్ని ఈ ఎన్నికల నుండి కాపాడింది. లేదంటే పరువు పోయేది అంటున్నారు.