Advertisement
Google Ads BL

వివాదంలో వకీల్ సాబ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ థియేటర్స్ లోను, ఓటిటి లోను అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ లా ఈ సినిమా నిలిచింది. పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ వకీల్ సాబ్ పవన్ హీరోయిజాన్ని హైలెట్ చేస్తూనే ఆడవాళ్ళకి న్యాయం చేసే వకీల్ సాబ్ లా కోర్టు హల్ లో అదరగొట్టే డైలాగ్స్ తో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన ఇన్నాళ్ళకి ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకోవడమే కాదు వకీల్ సాబ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో ఓ సన్నివేశంలో అంజలి మార్ఫింగ్ ఫోటో పెట్టి.. ప్లీజ్ కాంటాక్ట్ అంటూ ఓ ఫోన్ నెంబర్ ని చూపించారు. అయితే  తన ఫోన్ నెంబర్ యూజ్ చేసారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసాడు. అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్ నెంబర్ ఇవ్వడం వలన తనకి చాలామంది ఫోన్స్ చేసి అటకాయితనంగా అల్లరి చేస్తున్నారని, అసభ్యమైన మాటలతో వేధిస్తున్నారని.. ఈ విషయంగానూ చిత్ర బృందంపై కేసు నమోదు చెయ్యాలంటూ పంజాగుట్టా పోలీస్ లని ఆశ్రయించగా వారు.. ఈ  కేసు విషయమై ముందుగా విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని చెప్పినట్టు సమాచారం.

Police Complaint Against Vakeel Saab Movie:

Police Complaint Against Pawan Kalyan Vakeel Saab Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs