ఒకప్పుడు యాంకర్ రవి - లాస్య బుల్లితెర స్టేజ్ మీద సూపర్ పెయిర్. వాళ్లిద్దరూ షో చేస్తున్నారంటే ఆ షోకి మంచి టీఆర్పీ వచ్చేసేది. చాలా తక్కువ టైం లో రవి - లాస్యాలు బుల్లితెర మీద పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈటివి ఢీ షో కి రవి - లాస్య ల టామ్ అండ్ జెర్రీ ఆట తో బాగా పేరు తెచ్చుకున్న ఈ జంట.. తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానెయ్యడమే కాదు.. లాస్య ఏకంగా బుల్లితెర కి దూరమైపోయి మంజునాధ్ ని వివాహం కూడా చేసేసుకుంది. కానీ మధ్యలో ఎన్ని ఇంటర్వ్యూ లో కనిపించినా లాస్య కానీ, రవి కానీ వారి మధ్యలో ఏ గొడవ జరిగిందో చెప్పలేదు. ఇక రీసెంట్ గా లాస్య బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక రవి - లాస్య ల జంట మరోసారి స్టార్ మా స్టేజ్ మీద కనిపించి ఐదేళ్ల సస్పెన్స్ కి తెరదించారు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి షోస్ చేసేస్తున్నారు. లాస్య - రవి మరోసారి విపరీతంగా పాపులర్ అవుతుండగా.. యూట్యూబ్ ఛానల్స్ వారు వారిద్దరి ఇంటర్వ్యూ తో బిజీ అయ్యారు. అయితే తాజాగా లాస్య - రవి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు రవి రహస్యాలను లాస్య బయటపెట్టేసింది.
చేతిలో ఫోన్, శానిటైజర్, అలాగే సోషల్ మీడియా చూడకుండా రవి ఉండాలేడంటూ రవి రహస్యాన్ని బహిర్గతం చేసింది లాస్య. కరోనా రాకముందు నుండి రవి చేతిలో శానిటైజర్ డబ్బా ఉండెదని.. షో మధ్యలో రవి చేతులని ఎప్పటికప్పుడు శానిటైజేర్ చేసుకునేవాడంటూ రవి గుట్టు బయట పెట్టింది లాస్య. రవి కారులో ఓ శానిటైజర్ డబ్బా ఉంటుంది అని, రవి గురించి ఇంకా చాలా రహస్యాలని బయట పెట్టింది లాస్య. మరి లాస్య విషయాలనూ రవి కూడా బయట పెట్టినా.. రవి గుట్టు మాత్రం బాగా హైలెట్ అయ్యింది.