Advertisement
Google Ads BL

విజయ్ తెలుగు డెబ్యూ


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళంలో ఎలాంటి కథతో సినిమా చేసినా.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కొత్త ఒరవడి సృష్టిస్తుంటాడు. తన సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ ని తానే బద్దలు కొడుతూ.. విజయ్ తమిళంలో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన మెర్సెల్, బిగిల్, మాస్టర్ ఇవన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. తమిళంలో కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ప్రస్తుతం విజయ్ తన 65 వ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ మరియు పాన్ ఇండియా హీరోయిన్ అయిన పూజ హెగ్డే తో విజయ్ ఫస్ట్ టైం రొమాన్స్ చెయ్యబోతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి. కత్తి వంటి సినిమాలని తెలుగులో రమేక్ చేసి హిట్ కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇప్పడు ఈ స్టార్ హీరో విజయ్ తెలుగులో నటించబోతున్నాడనే న్యూస్ కాస్త నవ్వు తెప్పిస్తున్నా.. టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి డైరెక్ట్ చెయ్యబోయే చిత్రంలో విజయ్ నటిస్తున్నాడని.. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నాడంటూ ఈ రోజు ఉదయం నుండి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు కి విజయ్ తో ఉన్న సాన్నిహిత్యం వలన వంశి స్క్రిప్ట్ ని విజయ్ కి వినిపించగా.. విజయ్ కూడా సానుకూలంగా స్పందించాడంటున్నారు. ఇందులో నిజమెంతుందో దిల్ రాజు కానీ వంశి కానీ స్పందిస్తేనే తెలుస్తుంది.

Thalapathy to make Tollywood debut!:

<span>Vijay is doing a Direct Telugu Movie in Vamshi Paidipally Direction, says Reports</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs