Advertisement
Google Ads BL

2022: సంక్రాంతి vs సమ్మర్


కరోనా సెకండ్ వేవ్ టైం లో ఎన్ని సినిమాలు వాయిదా పడి ఎన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కి రిలీజ్ అవుతాయో తెలియదు కానీ.. ఇప్పుడు మొదలు కాబోయే సినిమాలు, ఇప్పటికే మొదలైన సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి అండ్ సమ్మర్ కి కచ్చిఫ్ లు వేస్తున్నాయి. ఈ ఏడాది.. రాధేశ్యామ్, RRR, పుష్ప, లైగర్, కెజిఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుంటే.. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక 2020 సమ్మర్ హీట్ కూడా మాములుగా లేదు. ఇప్పటికే ప్రభాస్ సలార్ ఏప్రిల్ లో విడుదల చెయ్యబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది సలార్ టీం. ఇక కొత్తగా మొదలు కాబోయే ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 కూడా ఏప్రిల్ లోనే ప్రభాస్ తో వార్ కి సై అంటున్నారు. అయితే ఎన్టీఆర్ - ప్రభాస్ మధ్యన పాన్ ఇండియా లేవల్లోనే ఫైట్ జరగబోతుంది. ఎందుకంటే NTR30- ప్రభాస్ సలార్ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఇక సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఇచ్చిన మహేష్.. సమ్మర్ లో త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమాని దింపుతున్నాడు. సో సంక్రాంతి మాత్రమే కాదు.. సమ్మర్ ఫైట్ కూడా మాములుగా ఉండేలా లేదు.

ఇప్పటికే ఇన్ని సినిమాలు సంక్రాంతి vs సమ్మర్ అంటుంటే.. అప్పటికి మరెన్ని సినిమాలు పోటీ కోస్తాయో అనేది ఏ ఏడాది చివరి నాటికీ ఓ క్లారిటీ వస్తుంది.

2022: Sankranthi vs Summer:

2022 Release Date Calendar for Upcoming New Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs