గత రెండు రోజులుగా తెలంగాణాలో కోవిడ్ కేసులు, కరోనా న్యూస్ లు కన్నా ఈటెల రాజేంద్ర భూ కబ్జా వ్యవహారం పలు టివి ఛానల్స్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఈటెల రాజేంద్ర భూ కబ్జా ఆరోపణలు రుజువైన కారణముగా, కలెక్టర్ అందించిన నివేదిక ప్రకారం కేసీఆర్ ఈటెల రాజేంద్రని పదవి నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ మొత్తం వ్యవహారంలో టివి ఛానల్స్ కీలక పాత్ర పోషించాయి కానీ కేసీఆర్ - ఈటెల పేస్ టు పేస్ మాట్లాడుకున్నది లేదు. ఇక ఈటెల రాజేంద్ర పై ఆరోపణలు రుజువైన కారణంగా మంత్రి పదవి నుండి తప్పించడంతో ఈటెల రాజేంద్ర కేసీర్ దగ్గరకి వెళ్ళను, ఆయన కాళ్ళ మీద పడను అంటూ.. నేరుగా శామీర్ పేటలోని ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తన అక్కసుని వెళ్లగక్కారు.
తానేమి తప్పు చెయ్యలేదని, ఓ పథకం ప్రకారమే తనని ఈ భూ కబ్జా కేసులో ఇరికించారని, నా భూముల్లో కాకుండా వేరే భూముల్లో సర్వే చేసారని, తాను వేల కోట్లు సంపాదించా అని ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుండి కేసీఆర్ తోనే ఉన్నా అని, తన తప్పు ఉంటే ఎలాంటీ విచారణకైనా సిద్దమే అని ప్రటించారు. టీఆరెస్ పార్టీకి మచ్చ తెచ్చే పని నేనుప్పుడూ చెయ్యను అని, మంత్రిగా అవకాశం ఇచ్చిన నాకు.. పార్టీకి మచ్చ తెచ్చే పని చెయ్యను, ఉద్యమ సమయంలో ఎలాంటి ప్రలోభావులకి లొంగ లేదు. నాకు నోటీసు లు ఇవ్వకుండా సర్వే చెయ్యడం ఎలా కుదురుతుంది. నేను కోర్టుకి వెళతాను. కేసీఆర్ నాలాంటి సాధారణమైన వ్యక్తిపై తన శక్తిని ఉపయోగించి నన్ను తెలంగాణ ప్రజలు అస్సహించుకునేలా చేస్తున్నారు.. కేసీఆర్ లాంటి వ్యక్తికి ఇది తగదు.
అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరు. నాపై కేసు ఎలా పెడతారు. అధికారం ఉంది, అధికారులు ఏం చేబితే అది చేస్తారు కదా అని నా మీద తప్పుడు ఆరోపణలు, కేసులు పెడితే ఊరుకోను, కార్మికుల కోసం షెడ్లు వేస్తె అస్సైన్డ్ భూముల కబ్జా అంటున్నారు. మీకు వ్యవసాయ క్షేత్రం ఉంది. దాని కోసం రోడ్లు వెయ్యలేదా.. నేను ప్రభుత్వం నుండి 5 పైసల సాయం పొందలేదు. ఐదు కుంటల నేలను తీసుకోలేదు.. మీ కేసులకు నేను భయపడను అంటూ కేసీఆర్ పై ఈటెల సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.