Advertisement
Google Ads BL

ఇందువదనతో కం బ్యాక్ అవుతున్న వరుణ్


హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాల్లో హీరోగా ప్రూవ్ చేసుకుని.. ఆ తర్వాత కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయిన వరుణ్ సందేశ్ కి లక్కు కలిసి రాలేదో, కథల ఎంపికలో పొరబాటో కానీ వరుణ్ కి కేవలం ఆ రెండు సినిమాల సక్సెస్ తప్ప మరో సినిమా హిట్ అయిన పాపాన లేదు. తనతో కలిసి ఓ సినిమాలో నటించి న వితిక శేరు ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ.. బిగ్ బాస్ లో అవకాశం రాగానే మళ్లీ హైదరాబాద్ కి వచ్చిన వరుణ్ సందేశ్ కి ఆ బిగ్ బాస్ ఫినిష్ అయిన రెండేళ్ళకి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది.

Advertisement
CJ Advs

చాలా ఏళ్ళ తర్వాత శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన  ఇందువదన ఫస్ట్ లుక్‌  చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు.  అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్  కథాపరంగా  చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. 

Varun Sandesh Induvadana 1st Look:

Induvadana 1st Look: Varun Sandesh Goes Ultra Bold
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs