Advertisement
Google Ads BL

దిశాకి ముద్దు పెట్టలేదంటున్న బాలీవుడ్ హీరో


బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ వాటెడ్ పెళ్ళికొడుకు సల్మాన్ ఖాన్ తాజా చిత్ర రాధే ఈద్ కానుకగా మే 13న రిలీజ్ కాబోతుంది. తన సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ.. ఈద్ కి ఈసారి ప్రభుదేవా దర్శకత్వంలో దిశా పటానితో కలిసి నటించిన యాక్షన్ ఫిలిం రాధే ని ప్రేక్షకుల మీదకి వదులుతున్నాడు సల్లు భాయ్. ఈ సినిమాపై మంచి బుజ్ ఉన్నప్పటికీ.. ఈ కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో థియేటర్స్ లో, ఓటిటిలోనూ రిలీజ్ కి సిద్దమైన సల్మాన్ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అగ్రెసివ్ గా వెళుతున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి తన సినిమాల్లో లిప్ లాక్ కిస్సులకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

Advertisement
CJ Advs

కానీ రాధే సినిమాలో దిశా పటానికి సల్మాన్ ముద్దు పెడుతున్న సీన్ ఒకటి ఉంది. రాధే ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ - దిశా ల లిప్ లాక్ సన్నివేశం బాగా హైలెట్ అయ్యింది. అంతేకాదు ఆ ముద్దు సీన్ కాస్తా రచ్చ కూడా అయ్యింది. అయితే రాధే ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఆ లిప్ లాక్ ఫై స్పందిస్తూ.. రాధే మూవీలో దిశా పటాని చాలా అద్భుతంగా నటించింది. ఆమె చాలా అందంగా కనిపించింది. దిశా నేను ఒకే ఏజ్ ఉన్న వాళ్ళలా కనిపించాం. అంటే నా ఏజ్ లా దిశా కనిపించడం కాదు, దిశా ఏజ్ లా నేను కనిపించాను. ఇక మా ఇద్దరి మధ్యన జరిగిన లిప్ లాక్ పై మాట్లాడాలంటే.. అసలది లిప్ లాక్ కాదు. ఆమె పెదవులపై నేను ముద్దు పెట్టలేదు. అది కేవలం తెరపైనే కనిపిస్తుంది. నిజానికి నేను దిశాకి ముద్దు పెట్టలేదు. ఈ సినిమాకి కథానుసారం ముద్దు సీన్ చాలా అవసరం అందుకే అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసాడు కానీ.. ఆ సీన్ ఎలా తీశారో మాత్రం చెప్పలేదు సల్మాన్ ఖాన్.

Bollywood hero who never kissed Disha:

Salman Khan Says He Hasn't Locked Lips with Disha Patani in Radhe: Kiss Tape Par Hai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs