నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానా రెడ్డి పది శాతం ఓట్లతో ఓడిపోయారు. బిజెపి అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన జానారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేయమన్న కారణమగానే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేశా అని, తనకి ఓట్లు వేసిన నాగార్జున సాగర్ ప్రజలకి కృతఙతలు అని చెప్పిన జానారెడ్డి.. తన ఆశలు, ఆశయాలు ప్రజల వద్దకు చేరితే చాలని.. ఇక మీదట ఎన్నికల్లో పోటీ చెయ్యనని చెప్పి షాకిచ్చారు.
ఇకపై ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయబోనని, కానీ రాజకీయ సలహాలు మాత్రం ఇస్తా అని, తన ఆశయాలు ప్రజలకు చేరితే చాలంటూ జానారెడ్డి రాజకీయ సన్యాసం చేయబోతున్నాను అన్నట్లుగా మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తాను కేవలం అధిష్టానం చెప్పినందువల్లే పోటీ చేశా అని.. ఈ ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో టీఆరెస్ గెలిస్తే.. 35 శాతం ఓట్లు కాంగ్రెస్ కి వచ్చాయని చెప్పారు జానారెడ్డి.