కరోనా కష్టకాలంలో అందరూ ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. యూత్ అంతా యూట్యూబ్ లో తల పెడుతుంటే.. మిగతా వాళ్ళు అంటే గృహిణులు సీరియల్స్, టివి షోస్ తో కాలక్షేపం చేస్తుంటారు. ఇక హీరోయిన్స్, హీరోలు, తమ ఫిజిక్ ని కాపాడుకోవడానికి జిమ్ లు వర్కౌట్స్ అంటూ కుస్తీలు పడుతుంటారు. కానీ కరోనా కాలంలో మానసిక ఒత్తిడిని అధికమించాలంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోలసిందే అంటుంది నటి కాజల్ అగర్వాల్. గత ఏడాది లాక్ డౌన్ టైం లో ఆనంద్ కిచ్లు ని వివాహమాడి.. హనీమూన్ పూర్తవ్వగానే ఆచార్య సెట్స్ లో వాలిపోయిన ఈ భామ మరోసారి ఆచార్య షూటింగ్ వాయిదా పడడంతో ఇంటికే పరిమితమైంది.
అయితే కాజల్ అగర్వాల్ కరోనా ని ఎదురించి నిలవాలని, ప్రస్తుతం మన చుటూ ఉన్న పరిస్థితులు మనకి అనుకూలంగా లేవని, మన చుట్టూ నిస్సహాయత, తెలియని అందోళన కనిపిస్తుంది అని, ఇలాటి సమయంలో మనసుని ఏదొక పని మీద నిమగ్నం చెయ్యడం చేస్తే.. మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు అంటుంది కాజల్ అగర్వాల్. అదే పని తాను చేస్తున్నట్టుగా చెబుతుంది కాజల్ అగర్వాల్. ఈ కరోనా కష్ట కాలాన్ని ఆధిగమించడానికి తాను కుట్లు అల్లికలు మీద మనసుని పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. కుట్లు అల్లికలతో కాలక్షేపం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.