Advertisement
Google Ads BL

ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ గ్లామర్ డాల్


ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాధేశ్యామ్ ఫినిష్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ తర్వాత ఆదిపురుష్, సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇక నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబో పాన్ ఇండియా ఫిలిం దసరా నుండి స్టార్ట్ కాబోతుంది అనే న్యూస్ ఉంది. నాగ్ అశ్విన్ మూవీలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడి కడుతుంది. ఇక సలార్ లో శృతి హాసన్, ఆదిపురుష్ లో కృతి సనన్  లతో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ లో పూజ హెగ్డే తో కలిసి నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ని లైన్ పెడుతున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

వార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కత్రినా కైఫ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. 

బాలీవుడ్ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ ఎవరు అనగానే టక్కున కత్రికా కైఫ్ పేరు చెబుతారు. కత్రినా కైఫ్ కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి.. స్టిల్ ఇప్పటివరకు ఒకటే గ్లామర్ ని, ఒకటే ఫిట్ నెస్ ని మెయింటింగ్ చేస్తుంది. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా లా విపరీతమైన ఫెమస్ అవ్వకపోయినా.. కత్రినా కైఫ్ కి ఓ రేంజ్ ఉంది. ప్రస్తుతం కత్రినా పేరు ప్రభాస్ సినిమాలో వినిపిస్తుంది. కత్రినా కైఫ్ తో సిద్ధార్థ్ ఆనంద్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా  తెలుస్తుంది. అన్నట్లు కత్రినా యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Top Star Heroine In Consideration For Prabhas Action Film:

Prabhas to pair up with Katrina Kaif 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs