హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది అందరికి తెలుసు. ఆ బ్లాక్ బస్టర్ సినిమా అసలైతే నిర్మాత బండ్ల గణేష్ రవితేజ తో చెయ్యాల్సింది అంట. అప్పటికే పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమా చేసిన బండ్ల గణేష్ కి ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. మరో సినిమా పవన్ తో చెయ్యాలని ఉన్నా ఎలా అడగాలో తెలియక ఆగిపోయాడట. అసలు తీన్మార్ మూవీ ఎందుకు ప్లాప్ అయ్యిందో అనేది తనకి ఇప్పటికి అర్ధం కావడం లేదు అంటున్నాడు బండ్ల గణేష్. నేను నిర్మాతగా మారడానికి పవన్ కల్యాణే కారణం. అందుకే ఆయనని దేవుడిగా కొలుస్తుంటాను. ఆయన నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు. అందుకే అలా అంటున్నాడు బండ్ల.
తీన్మార్ తో పవన్ కళ్యాణ్ గారికి ప్లాప్ ఇచ్చినందుకు చాలా గిల్టీగా ఉండేది. అందుకే ఆయనకి మరో హిట్ ఇవ్వాలని ఉన్నా.. డేట్స్ అడిగితే బావుండదు అని భావించి.. రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. తీన్మార్ మూవీ తో వచ్చిన నష్టాలూ పూడ్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు నాకు మరో అవకాశం ఇచ్చారు. అలా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ రవితేజ నుండి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇక నిర్మాతగా నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెబుతున్నాడు బండ్ల గణేష్.