Advertisement
Google Ads BL

హిందీ నేర్చుకునే పనిలో రష్మిక


కన్నడ నుండి బాణంలా దూసుకొచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనే కాదు పాప తమిళ్, బాలీవుడ్ లోను బిజీ తారగా మారింది. ఇక తెలుగు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ఇక్కడ తెలుగులో మాట్లాడడం నేర్చుకుంది. అంతేకాదు తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక తనకి ఎన్ని సినిమాలు సూపర్ హిట్ రేంజ్ ఇచ్చినా తాను కన్నడలో నటించిన ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీనే తన ఫెవెరెట్ మూవీగా చెబుతుంది రష్మిక. రష్మిక గురించి నిజాయితీగా మాట్లాడుకునే విషయాలేమైనా ఉంటేనే వాటి గురించి మాట్లాడుతుంది. లేదూ ఆ చెవిని విని ఈ చెవిని వదిలేసే విషయాలు మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటుంది రష్మిక. 

Advertisement
CJ Advs

తన లైఫ్ లో తనకి పని నేర్పించిన విషయాలే ఎక్కువ అని, కొత్త భాషలను కూడా వృత్తిలో భాగమని నేర్చుకుంటున్నా అని, ఏ భాషలో సినిమాలు చేసినా ఆ భాష నేర్చుకుంటా అంటుంది రష్మిక. తెలుగు బాగా నేర్చుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేస్తుండడంతో.. హిందీ భాషనీ అనర్గళంగా మాట్లాడేలా రష్మిక హిందీ నేర్చుకుంటుందట. ఎల్లో కలర్ అంటే ఇష్టపడే రశ్మికకి ఆ ఎల్లో కలర్ తనలో పోజిటివిటీని పెంచుతుందట. 

Rashmika in her work of learning Hindi:

Rashmika Mandanna to sign her 3rd Bollywood film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs