Advertisement
Google Ads BL

థియేటర్స్ లో దక్కని ఆనందం ఓటిటిలో దక్కింది


మార్చ్ 11 న రెండు సినిమాలతో పోటీ పడి.. మంచి టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్స్ పరంగా సో సో మూవీగా మిగిలిపోయి శర్వానంద్ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీకారం మూవీ ఓటిటిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. మహా శివరాత్రి రోజున జాతి రత్నాలు, గాలి సంపత్ మూవీ లతో పోటీ పడిన శ్రీకారం మూవీకి మంచి మూవీ, మంచి అట్టెంప్ట్ అంటూ పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జాతి రత్నాలు కామెడీ ఎంటర్టైన్ ముందు చిన్నబోయింది. వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో ఎలా చెయ్యాలో చెప్పిన ఓ కుర్రాడి కథే ఈ శ్రీకారం మూవీ. పెద్ద చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగం చేసే కుర్రాడు.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. వ్యవసాయం చెయ్యడం, అందులో ఆ యువకుడు ఎదుర్కున్న సవాళ్ళని దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.

Advertisement
CJ Advs

తండ్రికి ఇష్టం లేకుండా వ్యవసాయాన్ని చేసి.. ఆధునిక పద్ధతుల్లో పంట పండించి గెలిచి చూపించిన యువకుడి కథగా శ్రీకారం మూవీ ఉంది. అయితే మంచి టాక్ తో సో సో కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అయిన ఈ సినిమా రీసెంట్ గా ఓటిటిలో విడుదలైంది. సన్ నెక్స్ట్ లో విడుదలైన శ్రీకారం మూవీ ఓటిటిలో సూపర్ హిట్ గా నిలిచింది. సన్ నెక్స్ట్ లో విడుదలైన కొద్ది రోజులకే అద్భుతమైన వ్యూస్ దక్కించుకున్న మూవీ గా శ్రీకారం నిలిచింది. మరి శర్వానంద్ కి థియేటర్స్ లో దక్కని ఆనందం ఓటిటిలో శ్రీకారంతో దక్కినట్టే.

Flop in theaters, hit in OTT:

Sreekaram gets Record Views in Sun Nxt
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs