సీఎం కేసీఆర్ కరొన నుండి కోలుకున్నారో.. లేదో.. తెలియదు. మొన్న సాయంత్రం రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చింది.. RTPCR టెస్ట్ చేసాం ఫలితం రేపు వస్తుంది అని వైద్యులు చెప్పినా.. నిన్న రావాల్సిన RTPCR టెస్ట్ ఫలితం రాలేదు. అసలు కేసీఆర్ కరోనా నుండి కోలుకున్నారో.. లేదో.. వైద్యులు చెప్పడం లేదు. మరోపక్క తెలంగాణాలో ఈ రోజు తో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది. కరోనా కట్టడి విషయంలో హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారని.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుందో చెప్పాలని, నైట్ కర్ఫ్యూ పై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో చెప్పాలని, ఈ రోజు లంచ్ అవర్ తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించాలని, లేదంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని, ప్రభుత్వ వ్యవహారాల్లో ఙక్యం చేసుకోవడం మా ఉద్దేశ్యం కాదని, కానీ కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తెలంగాణ హై కోర్టు.
అటు మంత్రులు ఈటెల రాజేంద్ర, టీఎస్ హోమ్ మినిస్టర్ మొహ్మద్ అలీలు తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇక కేసీఆర్ కరోనా నుండి కోలుకున్నాక అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నా.. హై కోర్టు మాత్రం ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఒత్తిడి చేస్తుంది.