Advertisement
Google Ads BL

కరోనా పై సమంత అవగాహన


తెలుగు, తమిళంలోనే కాదు.. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటబోతున్న సమంత కి హెల్త్ పరంగా, సామాజికంగా, అలాగే ఫిట్ నెస్ పరంగా అవగాహన చాలా ఎక్కువ. పెళ్లి తర్వాత  కూడా మంచి గ్లామర్ మెయింటింగ్ చెయ్యడంతో సమంత కి ఎవరూ సాటి రారేమో అన్నట్టుగా సమంత ఫిట్ నెస్, ఆమె గ్లామర్ రహస్యం ఉంటుంది. అయితే తాజాగా కరోనా పేషేంట్స్ లో సమంత అవగాహన కల్పిస్తుంది. నమ్మకం, సానుకూల దృక్పథమే మనల్ని ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ, కోవిడ్ మనల్ని చుట్టుముడుతున్న వేళ ప్రతి ఒక్కరికి కరోనా తో పోరాడగలమనే ధైర్యం రావాలి. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదురించగలమే సానుకూల దృక్పధంతో ముందుకు సాగాలి.

Advertisement
CJ Advs

కష్టం వచ్చింది కదా అని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, కరోనా వచ్చింది కదా అని ఆత్మహత్యలు చేసుకోవడం కరోనాకి పరిష్కారం కాదు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. ఎలాంటి సమయంలోనూ ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు అంటూ ట్వీట్ చేసిన సమంత.. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వస్తుంది. మాస్క్ పెట్టుకుని సామజిక, భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనని జయించవచ్చు.. ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ సమంత సోషల్ మీడియా ద్వారా ప్రజలని చైతన్యవంతుల్ని చేస్తుంది. 

Samantha Awareness on Corona:

Samantha says Let's fight against Corona, let's conquer Corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs