Advertisement
Google Ads BL

హరితేజ డెలివరీ: షాకింగ్ కామెంట్స్


సీరియల్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్, కేరెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ హరితేజ ఈ మధ్యనే పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే హరితేజ తొమ్మిదినెలలు తన బిడ్డని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా తన గర్భంలో దాచుకున్నా.. ఆమె డెలివెరి టైం లో హరితేజ పడిన కష్టాలను ఓ వీడియో ద్వారా పంచుకుంది. తొమ్మిదినెలల పాటు కరోనా తో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తాను డెలివరీ అయ్యే పది రోజుల ముందు తన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి రావడం, తనకి కరోనా పాజిటివ్ రావడంతో, పుట్టబోయే బేబీ పరిస్థితి ఎలా ఉంటుందో అని హరితేజ ఆమె భర్త దీపు చాలా కంగారు పడిన విషయాలను చెప్పింది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా తనకి డెలివరీ చేయలేమని డాక్టర్స్ చెప్పారని.. ఎలాగో హాస్పిటల్ లో అడ్మిట్ అయితే.. బేబీ డెలివరీ టైం లో తల్లితండ్రులు, అందరూ దగ్గర ఉండాల్సిన సమయంలో తన దగ్గర ఎవరూ లేకుండా పోయారని.. కేవలం తన భర్త, తానే ఒంటరిగా ఉన్నామని చెప్పుకొచ్చింది.

ఇక నార్మల్ డెలివరీ అవ్వదని సిజేరియన్ చెయ్యాలని డాక్టర్స్ చెప్పడంతో.. తాము సి సెక్షన్ చేయించుకున్నామని, అయితే బేబీ కి నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా.. తనకి కరోనా ఉండడంతో.. బేబీ ని వేరే చోట పెట్టారని, కేవలం వీడియో కాల్స్ లో బేబీ ని చూసుకున్నామని, ఇక పాపకి ఫీడింగ్ కూడా చేయలేకపోయానని అది ఎంతో నరకమని చెబుతుంది హరితేజ.  కరోనా తో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమకి కరోనా వచ్చింది అని, ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బావుండేది.. అని తన డెలివరీ టైం లో జరిగిన విషయాలను హరితేజ ఆ వీడియో లో చెప్పుకొచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ ధరించండి అంటూ హరితేజ చెబుతుంది. 

Actress Hari Teja Shares Emotional Video About Her Covid :

Hari Teja emotional video: I got corona a week before baby was born
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs