కరోనా సెకండ్ వేవ్ తో భారత్ విలవిల్లాడిపోతోంది. కరోనా భారత లోకి ఎంటర్ అయినప్పుడు లాక్ డౌన్ తో చాలా వరకు కరోనాని కట్టడి చేసినా.. సెకండ్ వేవ్ ని మాత్రం భరత్ అంచనా వెయ్యలేక ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. గత ఏడాది అమెరికా లో ఇప్పుడు భరత్ లో ఉన్న భయానక పరిస్థితులే దర్శనమిచ్చాయి. రోజుకి లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో అగ్రరాజ్యం విలవిల్లాడింది. ట్రంప్ తీసుకున్న వెర్రిబాగుల నిర్ణయాలతో అమెరికా కరోనా తో వణికిపోయింది. కానీ ఈ ఏడాది అమెరికా అగ్రరాజ్యం కరోనాని జయించినట్టుగానే కనిపిస్తుంది. అక్కడ కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది.
అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ లేకుండా తిరగొచ్చు అంటూ అమెరికా ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మాస్క్ లేకుండా బయటికి వెళ్లొచ్చు అంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటించడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ లేకుండా బయటికి వెళ్లొచ్చని, ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ ల్లో మాస్క్ పెట్టుకుంటే మంచిది అని అమెరికా ప్రభుత్వం సూచిస్తుంది. ఇక్కడ ఇండియాలో డబుల్ మాస్క్ పరిస్థితులు నెలకొంటే.. అమెరికా మాస్క్ లేని అమెరికాగా కనిపిస్తుంది.