Advertisement
Google Ads BL

థియేటర్స్ లో ప్లాప్.. ఓటిటి లో హిట్


నాగార్జున రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ ని గత ఏడాది లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో.. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా రిలీజ్ చెయ్యాలని మొదట్లో భావించిన.. జనవరిలో క్రాక్, ఫిబ్రవరిలో ఉప్పెన సినిమాలు థియేటర్స్ లో సూపర్ హిట్ అవడంతో నాగార్జున మనసు మార్చుకుని వైల్డ్ డాగ్ మూవీని ఏప్రిల్ 2 న థియేటర్స్ లో విడుదల చెయ్యగా.. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేంటి కలెక్షన్స్ అదిరిపోతాయనుకున్నారు. కానీ ఈ వైల్డ్ డాగ్ కి అనుకున్న కలెక్షన్స్ రాకపోయేసరికి ఆ సినిమా ప్లాప్స్ లిస్ట్ లో చేరడమే కాదు.. నాగ్ కి వరసగా మరో ప్లాప్ వచ్చేసింది.

Advertisement
CJ Advs

అయితే వైల్డ్ డాగ్ థియేటర్స్ లో ప్లాప్ అయితే అయ్యింది కానీ.. తాజాగా ఓటిటిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వైల్డ్ డాగ్ మూవీ ఇప్పటివరకు తెలుగులో విడుదలైన సినిమాలన్నిటిలో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమాగా వైల్డ్ డాగ్ ఉందని తెలుస్తుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళ, హిందీ అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో వైల్డ్ డాగ్ ని విపరీతంగా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. దానితో వైల్డ్ డాగ్ టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. థియేటర్స్ లో ప్లాప్ అయిన వైల్డ్ డాగ్ ఇప్పుడు ఓటిటిలో భారీ హిట్ అవడంతో.. థియేటర్స్ లో విడుదల చేసి అనవరసంగా పరువు పోగొట్టుకున్నారు. అది ముందే ఓటిటిలో రిలీజ్ చేస్తే బావుండేది అంటున్నారు.

Flop in theaters, hit in OTT:

Wild Dog gets thumping response on OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs