కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పేషేంట్స్ తో హాస్పిటల్స్ దగ్గర సహకారాలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. మరోపక్క దేశం లో కోవిడ్ తీవ్రత దృష్యా.. పది శాతం కేసులు ఎక్కువైతే మినీ లాక్ డౌన్స్ తప్పవని కేంద్ర హెచ్చరిస్తుంది. అయితే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్స్ లేదంటే నైట్ కర్ఫ్యూలని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లో మరో వారం లాక్ డౌన్ పొడిగించగా. మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ, తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. ఇక తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా కర్ణాటకలో లాక్ డౌన్ పెడితేనే కరోనా కట్టడి సాధ్యమంటున్నారు.
దాని కోసం కర్ణాటకలో రేపటి నుండి 14 రోజుల పాటు లాక్ డౌన్ పెడుతున్నట్టుగా ప్రకటించారు. అత్యవసర సేవలు తప్ప కర్ణాటకలో అన్ని నిలిచిపోనున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఉదయం మాత్రమే నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్ల మీదకి రావాలని.. మిగతా సమయంలో అన్ని బంద్ అని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెంగుళూరులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. ఇక రేపటినుండి కర్ణాటకలో 14 రోజులు పాట లాక్ డౌన్ అమలులోకి వస్తుంది.