కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి దేశంలో ఎలా ఉందొ చూస్తూనే ఉన్నాము. కరోనా ఉధృతి తో సినిమా ఇండస్ట్రీ మరోసారి అతలాకుతలం అయ్యేలా కనిపిస్తుంది. గత ఏడాది మొత్తాన్ని పోగొట్టుకుని ఈ ఏడాది జనవరి నుండి కోలుకుంటుంది అనుకుంటే.. సెకండ్ వేవ్ మరోసారి సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. కుదేలైన సినిమా ఇండస్ట్రీ కోలుకునేలోపు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా మరోసారి థియేటర్స్ మూత బడడంతో సినిమాలన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటివరకు మీడియం, చిన్న సినిమాలు మాత్రమే వాయిదాలు పడుతున్నాయి. ఇక భారీ బడ్జెట్ మూవీస్ అన్ని మే నుండి రిలీజ్ కి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ పోస్ట్ పోన్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నాయి.
అందులో మొదటగా మే 13 న విడుదల కాబోతున్న ఆచార్య మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇక చేసేది లేక ఆచార్య సినిమాని ఆగష్టు కి పోస్ట్ పోన్ చేసే యోచనలో కొరటాల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ ఆచార్య సినిమాని రిలీజ్ చేసే పంపిణి దారులకి మేటర్ పాస్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాని విడుదల వాయిదా వెయ్యడం తప్ప మరో ఆలోచన కనిపించడం లేదని.. ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. అందుకే ఆచార్య ని ఆగష్టు కి పోస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని మే ఫస్ట్ వీక్ లో అధికారికంగా తెలియజేస్తారని సమాచారం.