అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ కి కరోనా సెకండ్ వేవ్ వలన ఎలాంటి బ్రేక్స్ పడలేదు.. పుష్ప చిత్రీకరణను సుకుమార్ ఓ యజ్ఞంలా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. లారీ డ్రైవర్ గా, ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర కనిపిస్తుంటే.. డీ గ్లామర్ గా కోయజాతి అమ్మాయిగా రష్మిక పాత్ర కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ఓ చెల్లి ఉంటుందట. ఆ పాత్రని తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
పుష్ప రాజ్ చెల్లెలు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా చనిపోతుందట. తన చెల్లి మరణానికి కారణమైన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మీద పగతోనే పుష్ప రాజ్ ఎర్ర చందనం లారీ డ్రైవర్ గా, కూలీగా మారతాడని, స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మీద పగ తీర్చుకుంటాడంటూ.. ఇదే పుష్ప స్టోరీ అని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గా విలన్ కేరెక్టర్ లో కనిపిస్తాడని టాక్.