ఎన్టీఆర్ - కొరటాల కాంబో అనుకోకుండా తెరపైకి వచ్చిన కాంబో. NTR30 కి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సింది.. ఆ ప్రాజెక్ట్ లోకి కొరటాల రావడం.. అది కాస్తా పాన్ ఇండియా ఫిలిం గా మారిపోయింది. కొరటాల శివ ఆచార్య తర్వాత అల్లు అర్జున్ కి కమిట్ అయినా మళ్ళీ ఎందుకో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి జంప్ అయ్యాడు. మరి ఆచార్య అవ్వగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది కొరటాలకి. ఆచార్య అవ్వగానే అంటే హరి భారీగా ఎలాంటి స్క్రిప్ట్ ఇస్తాడో అని ఎన్టీఆర్ ఫాన్స్ కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు ఆచార్య సినిమా షూటింగ్ కి బ్రేకులు పడడంతో.. కొరటాల శివ ఫ్రీ అయ్యాడు. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాకే ఆచార్య షూటింగ్ చేద్దామని చిరు చెప్పడంతో కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ కథ మీదకి షిఫ్ట్ అయ్యాడు.
ప్తస్తుతం ఎన్టీఆర్ కథ మీద కొరటాల కుస్తీలు పడుతున్నాడట. ఆచార్య షూటింగ్ మొదలయ్యేలోపు ఎన్టీఆర్ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ తో పాటుగా కొరటాల నటుల ఎంపిక చేయబోతున్నాడట. ఇప్పటికే హీరోయిన్ కియారా అద్వానీ తో కొరటాల చర్చలు జరిపి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా లెవల్ కి సరిపోయే విలన్ కేరెక్టర్ దగ్గరనుండి సినిమాలోని కీలక నటుల వరకు కొరటాల అన్ని భాషా నటులని ఎన్టీఆర్ సినిమాలో ఇన్వాల్వ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలయ్యే లోపులో కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబందించిన ఏర్పాట్లని పక్కాగా పూర్తి చేస్తాడట.