Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ స్పీడుకి బ్రేకులు


ఏళ్ళకి తరబడి షూటింగ్ చిత్రకారణతోనే టైం ని తినేస్తున్న రాధేశ్యామ్ టీం.. ఆ సినిమా లుక్స్ ఇవ్వడానికి కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. పోనీ బయటికి వదిలే లుక్స్ అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా అంటే అదీ లేదు. రాధేశ్యామ్ నుండి ఏ లుక్ బయటికి వచ్చినా విమర్శలు తప్ప క్లాప్స్ పడ్డ దాఖలాలు లేవు. ఆఖరికి ప్రభాస్ ఫాన్స్ కూడా రాధేశ్యామ్ లుక్స్ విషయంలో సంతోష పడడం లేదు. ఇక జులై నెలాఖరున రాధేశ్యామ్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ ఇచ్చినా.. ఇప్పుడు అనుకున్న డేట్ కి రాధేశ్యామ్ రావడం కష్టమే అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఇంకా ఓ సాంగ్ చిత్రీకరణ బాలెన్స్ ఉంది, కొన్ని సీన్స్ చిత్రీకరణలో రాత్రి పగలు కష్టపడుతున్న రాధేశ్యామ్ టీం కి పూజ హెగ్డే షాకిచ్చింది. పూజ హెగ్డే - ప్రభాస్ లపై ఓ సాంగ్ చిత్రీకరణ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని కోసం ఓ భారీ సెట్ కూడా సిద్ధమైంది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ కి కరోనా అడ్డం పడింది. షూటింగ్ పరిగెత్తిస్తున్న రాధేశ్యామ్ కి పూజ హెగ్డే కి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడడమే కాదు.. ఇప్పడు సినిమా రిలీజ్ కూడా ప్రశ్నార్థకంగానే మారింది. మరి అనుకున్న టైం కి రాధేశ్యామ్ రిలీజ్ ఉంటుందా.. లేదా.. అనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే మారింది.

Radhe Shyam to be postponed?:

Radhe Shyam release date gets postponed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs