బాలకృష్ణ అఖండ సినిమా మే 28 న విడుదల అవుతుందా .. లేదా అనేది కరోనా నే చెప్పాలి. మరో 10 రోజుల్లో అఖండ సినిమా షూటింగ్ కి బాలకృష్ణ - బోయపాటి ప్యాకప్ చెప్పేస్తారు. ఈ పది రోజుల్లో అఖండ టీం సేఫ్ గా ఉంటే.. షూటింగ్ కి నో ప్రాబ్లెమ్. లేదంటే ఆ పది రోజుల షూటింగ్ కి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ అంటే బోయపాటి చేతిలో పని. అన్నీ అఖండకి అనూకూలంగానే ఉన్నా కరోనా కరుణించాలి. అప్పుడే అఖండ రిలీజ్ సజావుగా జరుగుతుంది. ఇక అఖండ విషయం పక్కనబెడితే..
బాలకృష్ణ నెక్స్ట్ మూవీ మే లో మొదలు కావల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన అది కాస్తా జులై లో మొదలు కాబోతుంది. గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబోలో పక్కా మాస్ మసాలా ఎంటెర్టైనెర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. జులై లో షూటింగ్ మొదలు పెట్టి గోపీచంద్ మలినేని బాలయ్య మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాది క్రాక్ తో గోపీచంద్ సంక్రాంతికి భారీ హిట్ కొట్టాడు. అలానే బాలయ్య మూవీ కూడా సంక్రాంతికే అని ఫిక్స్ అవుతున్నాడు.
మరి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబో హరి హర వీరమల్లు, మహేష్ బాబు - పరశురామ్ ల సర్కారు వారి పాట సినిమాలు 2022 సంక్రాంతికే విడుదలకు డేట్స్ అనౌన్స్ చేసారు. ఇప్పుడు బాలయ్య పవన్ - మహేష్ లతో యుద్దానికి సిద్దపడుతున్నాడు.