Advertisement
Google Ads BL

పవన్ కోసం డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో రాజు


పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేసి నిర్మాతగా తెగ హ్యాపీగా ఉన్నారు దిల్ రాజు. వకీల్ సాబ్ సినిమా సక్సెస్ అవడంతో అదే ఆనందంతో మరో మూవీ చెయ్యడానికి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని  ఒప్పించాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వకీల్ సాబ్ విడుదల కాకముందే దిల్ రాజు కి పవన్ మాటిచ్చేశారట. మరో మూవీ చేద్దామని. దానితో దిల్ రాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడి ని సెట్ చేసే పనిలో తలమునకలై ఉన్నాడట. దిల్ రాజు కి దగ్గరగా ఉండే దర్శకుల లిస్ట్ ముందు పెట్టుకుని అందులో ఉన్న డైరెక్టర్స్ ని దిల్ రాజు ఫిల్టర్ చేస్తున్నాడట.

Advertisement
CJ Advs

మహర్షి తో నేషనల్ అవార్డు ఇచ్చిన వంశి పైడిపల్లిని పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంచుకున్నాడనే టాక్ అయితే మొదలైంది. మహర్షి తర్వాత ఖాళీగా ఉన్న వంశి పైడిపల్లి తో పవన్ మూవీ ని సెట్ చేసే పనిలో దిల్ రాజు ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్ రీమేక్ ఏకే రీమేక్, హరి హార వీరమల్లు, హరీష్ శంకర్ మూవీ, సురేందర్ రెడ్డి మూవీ తో పాటుగా బండ్ల గణేష్ తో కమిట్ అయిన మూవీ తర్వాత దిల్ రాజు సినిమా ఉంటుంది. ఈ లోపు దిల్ రాజు వంశి పైడిపల్లితో కథ సిద్ధం చేయించి పవన్ తో మూవీకి కమిట్ చేయిస్తాడన్నమాట. 

Dil Raju locks Pawan Kalyan once again:

Dil Raju to rope in Maharshi director for Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs