Advertisement
Google Ads BL

బాలయ్య ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో నిర్విరామంగా సాగుతుంది. కరోనా కల్లోలం, సెకండ్ వేవ్ ఉధృతి ఎలా ఉన్నా.. అన్ని కరోనా నిభందనలు పాటిస్తూ షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నారు బోయపాటి. మరో నెల రోజుల్లో అంటే మే 28 న విడుదల చెయ్యడానికి ఎప్పుడో డేట్ ప్రకటించిన అఖండ మూవీ.. అనుకున్న టైం కి రావడానికి టీం కష్టపడుతుంది. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతుంది. అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నా.. కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడం, ఆక్యుపెన్సీ తగ్గించడంతో.. రిలీజ్ లు ఆగిపోతున్నాయి.

Advertisement
CJ Advs

అందుకే BB3 అఖండ రిలీజ్ పోస్ట్ పోన్ అవడం అనివార్యంగా మారేట్టుగా కనిపిస్తుంది. వచ్చే నెలలో రిలీజ్ అయ్యే సినిమాల్ని పోస్ట్ పోన్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోపక్క మే లోనే మొదలు కావల్సిన బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబో మూవీ కూడా జూన్ కి షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తుంది. బాలకృష్ణ - గోపీచంద్ కాంబో మూవీని మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటే.. దానిని పక్కా మాస్ ఎంటర్టైనర్ గ గోపీచంద్ చూపించబోతున్నాడట. ఇప్పటికే బాలయ్య సినిమా స్క్రిట్ ని పక్కాగా పూర్తి చేసే పనిలో దర్శకుడు గోపిచంద్ ఉన్నాడట. సో అఖండ రిలీజ్ వాయిదా, గోపీచంద్ మూవీ స్టార్ట్ కావడానికి టైం పట్టడం ఇవన్నీ బాలయ్య ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ కాక మరేమిటి.

Bad news for Balayya fans:

Fans getting worry about Akhanda release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs