అఖండకి ఓటిటి నుండి భారీ ఆఫర్


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో BB3 గా రాబోతున్న అఖండ మూవీ పై భారీ అంచనాలున్నాయి. హ్యాట్రిక్ హిట్ పక్కా అని అఖండ రెండు టీజర్స్ సినిమాపై ఓ హైప్ క్రియేట్ చేసాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణముగా చాలా సినిమాల షూటింగ్ కి బ్రేకులు పడినా.. అఖండ షూటింగ్ ఆగినట్లుగా న్యూస్ లేదు. బోయపాటి అఖండ మూవీ యాక్షన్ సీక్వెన్స్ ని వికారాబాద్ అడవుల్లో బాలయ్య - అఖండ విలన్ రోల్ చేస్తున్న హీరో శ్రీకాంత్ పై చిత్రీకరిస్తున్నారు. అయితే మే 28 న విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ పై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.

కారణం కరోననే. కరోనా వలన థియేటర్స్ మూతపడ్డాయి. నైట్ కర్ఫ్యూలతో సినిమాలన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. దానితో ఇప్పుడు అఖండ సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అఖండ సినిమా కి ఓటిటి ల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటిటి సంస్థ అఖండ మూవీ కి భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్. అఖండ మూవీ కి ఆ ఓటిటి సంస్థ దాదాపు 65 కోట్లకు పైగా ఆఫర్ చేసిందట. ప్రస్తుతం యూట్యూబ్ లో అఖండ టీజర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ తో అఖండ పై అంచనాలతో ఆ ఓటిటి సంస్థ అంత భారీ ఆఫర్ అఖండకి ఇచ్చినా.. దర్శకనిర్మాతలు మాత్రం మా సినిమా థియేటర్స్ లోనే విడుదలవ్వాలి.. మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చేలా ఉండాలి.. అంతేకాని ఓటిటికి ఇవ్వమని తేల్చి చెప్పేశారట.

ఇప్పటికే అఖండ మూవీ కి హాట్ స్టార్ శాటిలైట్, డిజిటల్ హక్కులను కలిపి 30 కోట్లకి ఎగరేసుకుపోయింది. అలాగే అఖండ థియేట్రికల్ బిజినెస్ కూడా పెద్ద మొత్తంలోనే మొదలైంది

An OTT giant offers Massive for Akhanda Digital Release:

BalaKrishna Akhanda received massive rate for OTT release
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES