Advertisement
Google Ads BL

పీవీపీ ని కుక్కని కొట్టినట్టు కొట్టాలి


ప్రొడ్యూసర్, పొలిటిషన్ పరం వి పొట్లూరి (పీవీపీ) సినిమాల విషయంలోనూ, అటు రాజకీయాల విషయంలోనూ కాంట్రవర్సీ కింగ్. అయితే తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పేరుని పెట్టకుండా.. ఆయన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవడం ఏమో కానీ.. పీవీపీ మాత్రం ఆ ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని పూర్తిగా కెలికి వదిలేసాడు. రీసెంట్ గా ముంబై రైల్వే స్టేషన్ దగ్గర ఓ పిల్లవాడు పట్టాలపై పడిపోగా.. ఆ పిల్లాడిని రక్షించడానికి ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ పిల్లాడిని రక్షించిన వీడియో ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఆ వీడియో ని పీవీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ పిల్లాడిని రక్షించిన వాడు రియల్ హీరో.. రీల్ హీరో కాదు.. లంగా డాన్స్ లు వేసే స్టార్స్ కి 50 కోట్ల పారితోషకాలు.. ఇలా రియల్ హీరోలకి జస్ట్ జావా బైక్.. హత విధీ, మనం చేసే కొంచమైనా, కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్‌కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. పవన్ ఫాన్స్ పీవీపీ దొరికితే వేసేద్దాం అని తిరుగుతున్నారు.

ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాకి పవన్ 50 కోట్ల పారితోషకం అందుకున్నాడనే టాక్ చూసిన పీవీపీ ఇలాంటి ట్వీట్ చేసాడు.. అంటూ పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా మెగా హీరోలంటే ప్రాణం పెట్టే జబర్దస్త్ హైపర్ ఆది అయితే మరింతగా రెచ్చిపోయి పీవీపీ ట్వీట్ కి ఘాటు రిప్లై ఇచ్చాడు. నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్నా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు. పులి ని చూసి నక్క వాత ట్టుకోవడం అంటే ఇదే. సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన‌గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని జనాలు అనుకుంటున్నారు అంటూ ఆది ఇష్టం వచ్చినట్లుగా పీవీపీ పై రెచ్చిపోయాడు.

Hyper Aadhi vs PVP:

 You have to hit like a dog, Hyper Aadi who broke on the star
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs