Advertisement
Google Ads BL

బడ్జెట్ మాత్రమేనా.. లాభాలు కూడా భారీగానే


నాని - టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాకి బడ్జెట్ లిమిట్ దాటిపోతుంది.. నిర్మాతలు శ్యామ్ సింగ రాయ్ బడ్జెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలోనూ, ఇటు వెబ్ మీడియాలోనూ జోరుగా నడిచింది. మరి ఒకే ఒక్క సెట్ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టారంటే బడ్జెట్ భారీగానే ఉంటుంది. అయితే శ్యామ్ సింగ రాయ్ సినిమా ఫస్ట్ లుక్ లో నాని వింటేజ్ లుక్ అన్ని ఆకట్టుకున్నాయి. శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ అంటూ శ్యామ్ సింగ రాయ్ కి 50 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారట నిర్మాతలు. వారు భారీగా పెడితేనేమిటి ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ థియేట్రికల్ హక్కుల సంగతి ఎలా ఉన్నా.. నాన్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. శ్యామ్ సింగ రాయ్ నాన్ థియేట్రికల్ హక్కులని ఏకంగా 30 నుండి 35 కోట్లు చెల్లించేందుకు రెడీగా ఉన్నారట. కానీ శ్యామ్ సింగ రాయ్ నిర్మాత మాత్రం సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఇంత క్రేజ్ ఉంటే.. ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంటివి బయటికి వస్తే మరింత క్రేజ్ వచ్చి ఇంకాస్త భారీ రేటు పలకడం ఖాయం. కాబట్టి.. అప్పుడే కంగారు పడి శ్యామ్ సింగ రాయ్ నాన్ థియేట్రికల్ హక్కులు అమ్మడానికి సిద్ధపడడం లేదట.

శ్యామ్ సింగ రాయ్ నిర్మాత అలా ఆలోచిందడం కరెక్ట్. కేవలం ఒక్క పోస్టర్ తోనే సినిమాకి ఇంత డిమాండ్ ఉంటే.. ట్రైలర్ వస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.. అప్పుడు లెక్కలు ఆటోమాటిక్ గా మారిపోతాయి. అందులోనూ ఈ సినిమాలో హీరోయిన్స్ గా సాయి పల్లవి, కృతి శెట్టి నటించడం సినిమాకి మరింత హెల్ప్ అవడం ఖాయం.

Solid Deal For Shyam Singha Roy Non Theatrical Rights:

Nani resume the final schedule of Shyam Singha Roy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs