Advertisement
Google Ads BL

ప్రియుడితో కలిసి తమ్ముడినే చంపేసిన నటి


కన్నడ ఇండస్ట్రీలో ఓ మాదిరి సినిమాలతో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షనాయా కాట్వే తాను ప్రేమించిన ప్రియుడితో కలిసి తమ్ముడిని చంపెయ్యడం కన్నడ చిత్రం సీమలో హాట్ టాపిక్ గా మారింది. షనాయా కాట్వే గత కొంత కాలంగా తన మేనేజర్ తో సన్నిహితంగా ఉండడమే కాకుండా మేనేజర్ నియాజ్ అహ్మద్ తో ప్రేమ కలాపాలు మొదలు పెట్టగా షనాయా కాట్వే సోదరుడు రాకేష్ ఈ విషయంలో ఆమెని హెచ్చరించాడు. అతనితో ప్రేమ వ్యవహారం మంచిది కాదని, ఇప్పటికే అతనికి చాలా లవ్ ఎఫ్ఫైర్స్ ఉన్నాయని రాకేష్ అతని సోదరి షనాయా కాట్వేకి చెప్పడంతో.. ఆమె  ఈ విషయాలని నియాజ్ అహ్మద్ చెప్పేసింది.

Advertisement
CJ Advs

దానితో నియాజ్ అహ్మద్ తన ప్రేమకి ఎప్పటికైనా రాకేష్ అడ్డుపడతాడనే కసితో.. అతని ఫ్రెండ్స్ తో కలిసి రాకేష్ ని దారుణంగా చంపేసి.. మృత దేహాన్ని కారు డిక్కిలోనే దాచగా.. తర్వాత శవం కుళ్లిపోయి వాసన వస్తే దొరికిపోతామని నియాజ్ అహ్మద్ అతని ఫ్రెండ్ గ్యాంగ్ రాకేష్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. అయితే ఈ వ్యవహారం పోలీస్ లకి తెలియడంతో.. ఈ హత్య చేసిన మేనేజర్ నియాజ్ అహ్మద్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకోగా.. రాకేష్ హత్య కేసు వెనుక ఆమె సోదరి షనాయా కాట్వే కూడా ఉందని తెలుసుకుని ఆమెని కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రియుడి మోజులో సొంత తమ్ముణ్ణె హత్య చెయ్యడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Shanaya Katwe arrested:

Kannada Heroine Shanaya Katwe Arrested By Police in brothers Murder Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs