ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కేసుల నియంత్రణలో భాగంగా లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూలు పెడుతుంటే.. తెలంగాణ రాష్ట్రం కూడా రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుంది. పోలీస్ శాఖ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో.. ఈ శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
ఇక ఏపీలో రేపట్నుంచి థియేటర్స్ కూడా మూత పడనున్నాయి. రాత్రి పది తర్వాత దుకాణాలు, థియేటర్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ అన్ని మూతబడనున్నాయి. సీఎం జగన్, ఏపీ మంత్రులు ప్రత్యేక మీటింగ్ లో ఈ కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.