Advertisement
Google Ads BL

లారీ తోలిన రకుల్


టాలీవుడ్ లో చెయ్యడానికి సినిమాలు లేకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం చేతినిండా సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ కళకళలాడుతుంది. బాలీవుడ్ సినిమాలతో ముంబై లోనే పాగా వేసిన రకుల్ ప్రీత్ సింగ్.. జిమ్ లో వర్కౌట్స్ అవీ ఇవీ అక్కడ చాలా బిజీ గా గడుపుతుంది. అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రకుల్ తన సినిమా విషయాలతో పాటుగా.. తన గ్లామర్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ ఓ బాలీవుడ్ మూవీ కోసం లారీ నడిపిన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమా లో అర్జున్ కపూర్ కి జోడిగా నటిస్తున్న రకుల్ ఆ సినిమా కోసం ట్రక్ నడపడం హాట్ టాపిక్ గా మరింది. 

Advertisement
CJ Advs

ఆ సినిమాలో రాధా అనే సున్నితమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నట్టుగా చెబుతున్న రకుల్ ప్రీత్ కి పర్సనల్ గా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే లారీ డ్రైవ్ చెయ్యడం అనేది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చెప్పినంత ఈజీ కాదని, లారీ నడపడం అనేది నేను ఊహించినదానికన్నా చాలా సరదాగా ఉందని.. అయితే నేను లారీ తోలడం చూసిన సెట్ లో అందరూ చాలా షాకయ్యారని చెబుతుంది రకుల్. ఈ లారీ నడపడం అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరిగా చెబుతుంది రకుల్.   

Rakul Preet shares her experience of driving :

Rakul Preet drives a truck 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs