Advertisement
Google Ads BL

భార్గవ్ వల్ల వీళ్ళకి అవమానాలు


నాలుగు రోజుల క్రితం మైనర్ బాలికని మోసం చేసిన కేసులో టిక్ టాక్ స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. భార్గవ్ చిప్పాడ అమ్మాయిలని మోసం చేసిన కేసులో అరెస్ట్ అవడంతో భార్గవ్ తో టిక్ టాక్ వీడియోస్ చేసిన అమ్మయిల పరిస్థితి ఘోరంగా తయారైంది. భార్గవ్ చిప్పాడతో వీడియోస్ చేసిన ఓ మై గాడ్ గర్ల్ నిత్య నే ఆ మైనర్ బాలిక అని, భార్గవ్ మోసం చేసింది నిత్యనే అని సోషల్ మీడియాలో న్యూస్ లు వస్తున్నాయి. అంతేకాకుండా భార్గవ్ వీడియోస్ చేసిన అమ్మాయిలని సోషల్ మీడియాలో వేధిస్తున్నారు. అలాంటి చీటర్ తో వీడియోస్ చేసిన మీరేంటి అంటూ వల్గర్ కామెంట్స్ తో వారిని తిట్టి పోస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఓ మై గాడ్ గర్ల్ నిత్యా, ఇంకా భార్గవ్ తో వీడియోస్ చేసిన అమ్మాయిలు మీడియా తో మాట్లాడుతూ తాము కాదని, భార్గవ్ మోసం చేసింది తనని కాదని నిత్యా చెబుతుంటే.. భార్గవ్ చీటర్ అని తమకి తెలియదని.. అతను అలాంటి వాడని తెలిస్తే దూరంగా ఉండేవాళ్లమని, తాము ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ వాపోతున్నారు. ఓ మై గాడ్ గర్ల్ నిత్య అయితే.. ఓ వీడియో రిలీజ్ చేసింది. ఫన్ బకెట్ భార్గవ్ కి తనకి ఎలాంటి సంబంధం లేదని, అతని కేసుతో తనకి సంబంధం లేదని, తనకి అందరూ మెసేజ్ లు చేస్తున్నారని, భార్గవ్ ని కలిసి వన్ ఇయర్ అయ్యింది అని, తాము ఇప్పుడు వీడియోస్ చెయ్యడం లేదని, అందరూ తన ఫొటోస్ వాడుతున్నారని, నా ఫొటోస్ వాడడం వలన నాకు ఇబ్బందిగా ఉంది.. నా ఫొటోస్ ని భార్గవ్ కేసు విషయంలో షేర్ చెయ్యొద్దు అని.. తాను సేఫ్ గా ఉన్నా అని నిత్య ఆ వీడియో లో పేర్కొంది. ప్రస్తుతం దిశా కేసులో భార్గవ్ రిమాండ్ లో ఉన్నాడు.

Oh My God Girl Nithya Clarify About Bhargav Case:

Fun bucket Bhargav Womaniser, Emotionally Blackmails Girls: Ex-girlfriend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs