నిన్నగాక మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ తో ఆయన ఫామ్ హౌస్ లోనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. కేసీఆర్ కి ఊపిరితిత్తుల్లో ఎలాంటి నిమ్ము లేదని, ఆయనకి చాలా మైల్డ్ గా కరోనా సోకినట్లుగా ఆయన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం తెలిపింది. అయితే తాజాగా కేసీఆర్ కుమారుడు, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకి కరోనా సోకినట్లుగా కేటీఆర్ ఇంతకుముందే ట్వీట్ ద్వారా తెలియజేసారు.
తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, తనకి కరోనా లక్షణాలు ఏం లేవని, చాలా మైల్డ్ సింటమ్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా ఆయన ట్వీట్ చేసారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ టీఆరెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు దేవుణ్ణి కోరుకుంటూ #GetWellSoonKTRsir అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.