Advertisement
Google Ads BL

అడక్కుండా అప్ డేట్ ఇచ్చి.. అడిగితే మాత్రం.


ప్రభాస్ ఫాన్స్ ఉసూరుమన్నారు. కారణం ఆదిపురుష్ అప్ డేట్ కోసం ఎదురు చూసి బాగా డిస్పాయింట్ అయ్యారు వాళ్ళు. బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి అయ్యింది అని ఓం రౌత్ ఎప్పుడైతే చెప్పాడో శ్రీరామ్ నవమికి ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ లుక్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఓం రౌత్ ఈ నవమి కి ఎలాంటి లుక్ రిలీజ్ చెయ్యలేదు. అసలు ఆదిపురుష్ సినిమా టైటిల్ కానీ, అందులో సీతగా కృతి సనన్ నటిస్తుంది అని కానీ, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు అని కానీ.. అడక్కుండానే అప్ డేట్స్ ఇచ్చిన ఓం రౌత్ ఇప్పుడు అడిగినా ఆదిపురుష్ లుక్ ఇవ్వలేదంటూ ప్రభాస్ ఫాన్స్ అలుగుతున్నారు.

Advertisement
CJ Advs

ఆదిపురుష్ లో రాముడి అవతారంలో ప్రభాస్ ఎలా ఉంటాడో ఊహించుకుంటున్న ఫాన్స్ కి ఆ లుక్ గనక వదిల్తే.. మాములుగా ట్రెండ్ చేసేవారు కాదు. ఆదిపురుష్ లుక్ కోసం అంత ఆత్రంగా ఎదురు చూసారు. రాముడికి ఇష్టమైన ఫెస్టివల్ శ్రీరామ నవమినే కాబట్టి ఆదిపురుష్ నుండి ఓం రౌత్ ప్రభాస్ రాముడి లుక్ ఇచ్చేస్తాడేమో అనుకుని.. ఇప్పుడు డిస్పాయింట్ అవుతున్నారు ఫాన్స్.

Prabhas Fans disappointed:

Prabhas Fans Disappointed As Adipurush Team Fails To Deliver Updates On Ram Navami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs