Advertisement
Google Ads BL

టిక్ టాక్ స్టార్ భార్గవ్ చిప్పాడ లీలలు


గత ఏడాది లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమైతే.. ఆ సమయాన్ని టిక్ టాక్స్ తో సద్వినియోగం చేసుకున్నారు చాలామంది. టిక్ టాక్స్ తో ఫెమస్ అయ్యారు కూడా. అలానే టిక్ టాక్ దుర్గారావు, భార్గవ్ చిప్పాడ లాంటి టిక్ టాక్ స్టార్స్ గా మారిపోయారు. ఓ మై ఓ మై గాడ్ గర్ల్ తో భార్గవ్ చిప్పాడ చేసిన టిక్ టాక్స్ తెగ ఫెమస్ అవడంతో భార్గవ్ ఒక్కసారిగా సెలెబ్రిటీ అయ్యాడు. వైజాగ్ లో టిక్ టాక్స్ చేసుకుంటూ ఉండే భార్గవ్.. టిక్ టాక్ లో ఫెమస్ అవడంతో హైదేరాబద్ కి సినిమా, బుల్లితెర అవకాశాల కోసం వచ్చాడు. ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో తిరిగి వెళ్లి వైజాగ్ లోనే మళ్ళీ వేరే యాప్ ద్వారా టిక్ టాక్స్ చేసుకుంటున్న భార్గవ్ ని దిశా చట్టం కింద పోలీస్ లు అరెస్ట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది.

Advertisement
CJ Advs

తనతో  పాటుగా టిక్ టాక్స్ చేసే మైనర్ బాలికని భార్గవ్ చీట్ చేసి ప్రెగ్నెంట్ చెయ్యడం తో ఆ బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్ తో దిశా చట్టం కింద పోలీస్ లు భార్గవ్ ని అదుపులోకి తీసుకున్నారు . తనతో టిక్ టాక్స్ చేసే ఆ బాలికని చెల్లి అంటూ భార్గవ్ మోసం చేసిన విషయం దగ్గరనుండి.. భార్గవ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి రావడం అందరిని విస్మయానికి గురిచేసింది. భార్గవ్ చిప్పాడ తాను ఒక సెలెబ్రిటీలా మారిపోయాను అని, చాలామంది అమ్మాయిలని సెలబ్రిటీస్ ని చేసేస్తాను అంటూ మోసం చేసినట్లుగా తెలుస్తుంది. పలువురు అమ్మాయిలతో భార్గవ్ తప్పుగా ప్రవర్తించాడని, చాలామందిని చీట్ చేసినట్లుగా పోలీస్ లు విచారణలో తెలగా.. భార్గవ్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా అతనికి మే 3 వరకు రిమాండ్ విధించింది కోర్టు.

Fun Bucket Bhargav arrested:

Fun Bucket Bhargav Chippada Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs