ప్రభాస్ బాహుబలి తో బాగా డల్ అయ్యాడు. ఐదేళ్లు బాహుబలి, రెండేళ్లు సాహో కి, మరో రెండేళ్లు రాధేశ్యామ్ కి ఇలా రెండేళ్ళకి ఓ ప్రాజెక్ట్ ప్రభాస్ నుండి వస్తుంది. ఫాన్స్ ఎప్పటికప్పుడు డిస్పాయింట్ అవుతున్నారు. అయినప్పటికీ ప్రభాస్ అలానే చేసాడు. కానీ ఈ ఏడాది ప్రభాస్ అందరి అంచనాలు తారుమారు చేస్తూ వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దడదడ లాడిస్తున్నాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ తో పాటుగా మరో మూవీ లైన్ లో ఉన్నట్లుగా టాక్. అయితే ఇన్ని సినిమాను ఏ 2025 కో రెడీ చేస్తాడనుకుంటే పొరబాటే. రాధేశ్యామ్ ఈ ఏడాది జులై లో విడుదలకు ప్లాన్ చేసాడు.
అలాగే సలార్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ కి దింపుతున్నాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ ఇప్పుడప్పుడే అవ్వదులే అనుకుంటే.. మహారాష్ట్ర లో మహా జనతా కర్ఫ్యూ ఉన్నా ఆదిపూష్ షూటింగ్ ఆపలేదు ఆయన. ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మార్చ్ లో మొదలైన ఆదిపురుష్ ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అంటే.. ప్రభాస్ స్పీడు కన్నా దర్శకుడు ఓం రౌత్ స్పీడ్ ఎక్కువగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఓం రౌత్ ఆదిపురుష్ ని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. అదే ప్లానింగ్ తో సినిమా షూటింగ్ చక్కబెడుతున్నాడు.
సీత గా కృతి సనన్, విలన్ రావణ్ గా సైఫ్ ఇలా అందరూ అందుబాటులో ఉండడంతో ఓం రౌత్ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడట. అన్నట్టు రేపు నవమి కానుకగా ప్రభాస్ ఫాన్స్ కి ఆదిపురుష్ నుండి ఏమైనా ట్రీట్ ఇస్తాడేమో చూడాలి.