Advertisement
Google Ads BL

టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్


టిక్ టాక్ ద్వారా ఫెమస్ అయ్యిపోయి.. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఆక్సిడెంట్స్ చేసినా తనని ఎవరూ ఏం చెయ్యలేరని పొగరు.. తన వెబ్ సీరీస్ కి, టిక్ టాక్స్ కి కోటి వ్యూస్ వస్తే సెలెబ్రిటీనే అన్న పొగరుతో ఈమధ్యన టిక్ టాక్ స్టార్స్ చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న సూర్య వెబ్ సీరీస్ తో బాగా ఫెమస్ అయిన.. షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారుతో ఓ యాక్సిడెంట్ చేసి.. తాను డబ్బులిచ్చి సెటిల్ చేసుకుంటా అంటూ పోలీస్ లతో వాదనకు దిగినట్టుగా.. ఇప్పుడు మరో టిక్ టాక్ స్టార్ ఇలానే ఓ కేసులో అరెస్ట్ అవడం కలకలం రేపింది. 

Advertisement
CJ Advs

అతనే ఫన్ బకెట్ భార్గవ్. భార్గవ్ టిక్ టాక్స్ తో బాగా ఫెమస్ అయ్యాడు. భార్గవ్ కి సోషల్ మీడియాలో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే భార్గవ్ టిక్ టాక్ తో సెలెబ్రిటీ అవతరమెత్తి.. బడా సెలబ్రిటీస్ తో ఫొటోస్ దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే కాదు.. ఓ మైనర్ బాలిక భార్గవ్ టిక్ టాక్ తో ఫెమస్ అయినట్లుగా తాను ఫెమస్ అయిపోవచ్చని భార్గవ్ ని సంప్రదించగా.. నిన్ను సెలెబ్రిటీని చేసే పూచి నాదని ఆ అమ్మాయిని నమ్మించగా..  భార్గవ్ ని నమ్మిన బాలికపై భార్గవ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలికను మోసగించిన కేసులో భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలిక తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

Tik tok star Bhargav arrest:

Fun Bucket Bhargav Arrest on Disha case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs